ఈ మధ్యకాలంలో మనం బాగా సినిమా ఇండస్ట్రీలో గమనించేది సినిమాని రెండు భాగాలుగా తరికెక్కించడం.  అప్పట్లో ఇలా చేసేవాళ్ళు కాదు డైరెక్టర్ లు.  సినిమాని సినిమా గానే తెరకెక్కించి.. రెండున్నర గంటల్లో సినిమాని క్లోజ్ చేసే వాళ్ళు . కానీ ఇప్పుడు డైరెక్టర్స్ మాత్రం లెంతీ కథను రాసుకొని .. మొదటి పార్ట్ కి కంటిన్యూ చేసే విధంగా సెకండ్ పార్ట్ ని తీసుకొస్తున్నారు. రెండు పార్ట్లతో కూడా కొందరు  డైరెక్టర్లు ఆగిపోవడం లేదు . మూడు నాలుగు అంటూ సీక్వెల్స్ పెంచుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నారు .


ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలను మనం ఎక్కువగానే చూస్తూ వస్తున్నాం . మరి ముఖ్యంగా బాహుబలి రెండు భాగాలుగా  వచ్చి ఎలా హిట్ కొట్టింది అనేది అందరికి తెలుసు.  ఆ తర్వాత కేజిఎఫ్ రెండు భాగాలుగా తెరకెక్కి ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో..ఆ తర్వాత పుష్ప2 సినిమా రెండు పార్ట్లుగా తెరకెక్కి బాక్సాఫీస్ చరిత్రనే తిరగరాసింది అనే విషయం అందరికీ తెలిసిందే . త్వరలోనే దేవర 2 కూడా రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి అన్ని విషయాలు బయట పెట్టేశారు కొరటాల . కాగా మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కే సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది .



ఇలాంటి మూమెంట్లోనే సెన్సేషనల్ కాంబో అల్లు అర్జున్ - అట్లి కాంబోలో తెరకెక్కే మూవీ కూడా రెండు భాగాలుగా రాబోతుందట.  ఈ సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్  తెరకెక్కుతుందట.  ఆ కారణంగానే రెండున్నర గంటలో సినిమా అంత అర్థమయ్యే విధంగా జనాలకు చూపించలేమని ఏమాత్రం అటు ఇటు అయినా సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని.. ఆకారణంగానే అట్లీ - బన్నీ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయ్యారట. అదే విధంగా కాల్ షీట్స్ కూడా ఇచ్చేసాడట బన్నీ. పుష్ప సినిమా హిట్ అవ్వడానికి.. సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడమే కారణం అంటూ చాలామంది ప్రముఖులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే హిట్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు బన్నీ . చూడాలి మరి బన్నీ అట్లీ కాంబో ఏ విధంగా సెట్ అవుతుందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.. ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనేది తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ కొంత మంది నెగిటీవ్ గా ట్రోల్ చేస్తున్నారు. పార్ట్ 1 లో ఉండే ముఖాలే పార్ట్ 2 లో చూడాలా అంటూ అసహనంగా కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: