ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు ఒక సూపర్ హిట్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేదాం.. జాట్ అనే హిందీ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. జాట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. జాట్ మూవీ వచ్చే నెల 5వ తేదీ నుండి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మొదట ఈ సినిమా హిందీలో ప్రసారం కానుంది. ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
 
ఇకపోతే ప్రస్తుతం నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ మూవీ జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ది డిప్లోమ్యాట్, ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్, నోన్నాస్, బ్యాడ్ ఇన్ ఫ్యూయెన్స్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ది రాయల్స్, ఫరెవర్, బ్లడ్ ఆఫ్ జెసు అనే వెబ్ సిరీస్ లు ఆడుగుతున్నాయి. ఎ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.


ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా కంటెంట్ బాగుంటే చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. సినీ ప్రియులకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వరంగా మారాయి అని చెప్పొచ్చు. ప్రతి వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి.అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: