టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి ఒకరు. `బృందావనం`, `ఎవడు`, `ఊపిరి`, `మహర్షి`, `వారసుడు` ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వంశీ పైడిపల్లి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వంశీ పైడిపల్లి నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కనీస అప్డేట్స్ కూడా లేవు. సాధారణంగా నటులైన, దర్శకులైన ఒక్క హిట్‌ పడిందంటే మూడు నాలుగు కొత్త ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెడుతుంటారు. కానీ వంశీ పైడిపల్లి అందుకు పూర్తిగా భిన్నం. స‌క్సెస్ ఉన్న సినిమాల్లేని పరిస్థితి ఆయనది.


ఇందుకు కారణం లేకపోలేదు.. కెరీర్ ఆరంభం నుంచి వంశీ పైడిపల్లి స్టార్ హీరోలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మిడ్ రేంజ్ హీరోల వైపు ఆయన కన్నెత్తి కూడా చూసింది లేదు. సరిగ్గా గమనిస్తే కెరీర్ మొత్తంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున, మహేష్ బాబు, దళపతి విజయ్ వంటి టాప్ స్టార్స్ తోనే వంశీ పైడిపల్లి సినిమాలు తీస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా స్టార్ హీరోల కోసమే వెయిట్ చేస్తున్నారు. కానీ బడా బడా హీరోలంతా నాలుగైదు సినిమాలు లైన‌ప్‌లో పెట్టుకుని అందుబాటులోకి లేకుండా పోయారు.


దాంతో వంశీ బాలీవుడ్ లో త‌న సౌండ్ వినిపించాల‌నుకున్నారు. బాలీవుడ్‌ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. వీరి సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తాయి. కానీ ఆమిర్ ఖాన్ తో వంశీ పైడిప‌ల్లి ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేదు. స్టార్ హీరో కావాల‌ని కూర్చున్న వంశీకి బాలీవుడ్ లోనూ నిరాశే ఎదురైంది. నిజానికి పెద్ద పెద్ద హీరోలు త‌మ లైన‌ప్ లో ఒక్క‌టి ప‌క్క‌కు జ‌రిపి, మ‌రో ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం దాదాపు ఉండ‌దు. ఈ విష‌యం తెలిసి కూడా వంశీ రెండేళ్ల నుంచి సైలెంట్ గా ఉండ‌టం సినీ ప్రియుల‌ను క‌ల‌వ‌ర పెట్టే అంశం. ఇప్ప‌టికైనా వంశీ పైడిప‌ల్లి రియాలిటీలోకి వ‌స్తారా..? స్టార్ హీరోలే కావాలి అన్న మంకి ప‌ట్టును ప‌క్క‌న పెట్టి టైర్ 2 హీరోల‌తో ముందుకు సాగుతారా..? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: