- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీ, తెలంగాణలో థియేటర్లను జూన్ 1 నుంచి బంద్ చేస్తామని ఇప్పటికే థియేటర్ యజమానులు అల్టిమేటం జారీ చేశారు. ఛాంబర్ లో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. దిల్ రాజు సారాద్యంలో సమావేశం జరిగింది. నైజంలో పెద్ద ఎగ్జిబిటర్ అయిన సునీల్ రాలేదు. మీటింగ్ అంతా అయిపోయాక జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే థియేటర్లు ఉన్నపలంగా బంద్ చేయడం జరిగే పనేనా అన్నది పెద్ద ప్రశ్న ? నిర్మాతలు అభిప్రాయం తెలుసుకోవాలి.. కేవలం నిర్మాతలు అభిప్రాయం తీసుకుంటే సరిపోదు... డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఎగ్జిబిటర్ల సమస్యలు ఎగ్జిబిటర్లవి .. నిర్మాతల కష్టం నిర్మాతలది.. రెంట్‌ మీద సినిమాలు వేస్తారా ? లేదా పర్సంటేజ్ మీద వేస్తారా ? అనే ఆప్షన్ ఉండాల్సి ఉంది. నైజాంలో ఇలాంటి ఆప్షన్ కు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.


నైజాంలో కనుక ఇదే ఆప్షన్ ఉంటే ఆంధ్ర , సిడెడ్‌ లో కూడా ఎగ్జిబిట‌ర్లు కూడా ఆలాగే ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఒకచోట థియేటర్లు ఓపెన్ చేసి మరోచోట క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. పైగా నెలాఖ‌రు నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కు షెడ్యూల్ అయి ఉన్నాయి. థియేటర్లో బంద్‌ చేస్తే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విడుదల చేయాల్సిన సినిమాలు వెనక్కి వెళితే థియేటర్ల‌కి ఏమీ లాభం ఉండదు సరి కదా .. నిర్మాతలకు నష్టం తప్పదు. నిర్మాతలు అంతా క‌ట్టు మీద ఉన్నారు. అటు ఎగ్జిబిటర్లు కూడా క‌ట్టు మీదే ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కూడా షెడ్యూల్ అయి ఉంది. అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ టైం లో ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు బంద్ చేస్తారా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ విషయం ఎలా ముగుస్తుంది అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: