
ఆ తర్వాత మళ్లీ యమదొంగ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. రాఖీ చిత్రంతో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో బాగానే క్రేజ్ పెరగడంతో ఇక బృందావనం సినిమాతో ఒక్కసారిగా ఎన్టీఆర్ కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. మళ్లీ టెంపర్ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో తన ట్రాక్ ని కొనసాగిస్తూ ఉన్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, జై లవకుశ, RRR, దేవర వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నారు.
సినిమా సినిమాకి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పటికే తన సినిమాలతో 500 కోట్ల క్లబ్లోకి చేరారు. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో పాటు బాలీవుడ్లో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజున చేసుకోబోతున్న తరుణంలో ఎన్టీఆర్ కి సంబంధించి కొన్ని విషయాలు అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. మరి ఈరోజు సినిమాల గురించి అప్డేట్లు వస్తాయని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులకు కూడా ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.