
సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే కేవలం డ్యాన్సులు , యాక్టింగ్ మాత్రమే కాదు డైలాగ్ డెలివరీ మోస్ట్ ఇంపార్టెంట్ . అందంగా ఉంటే సరిపోదు అందంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా ఇంపార్టెంట్ . సినిమాలో హీరోలు చెప్పే డైలాగ్స్ చాలామంది జనాలు ఫాలో అవుతూ ఉంటారు . అయితే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిలా ఏ ఒక్క హీరో కూడా డైలాగ్స్ చెప్పలేరు అని చాలామంది సినీ పెద్దలు కామన్ పీపుల్స్ ఎప్పుడు అంటూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ చూసిన తర్వాత తాతకు తగ్గ మనవడురా వీడు అంటూ చాలా మంది పొగిడేశారు.
తారక్ డైలాగ్స్ చెప్పే విషయంలో అచ్చుగుద్దినట్టు తాతలానే దిగిపోయాడు . ఇండస్ట్రీలో మరి ఏ హీరో కూడా జూనియర్ ఎన్టీఆర్ ల గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పనే చెప్పలేరు అంటూ యమదొంగ సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు . యమదొంగ సినిమాలో ఎంతో కఠినమైన డైలాగ్స్ కూడా సింగిల్ టేక్ లో ఓకే చేసేసాడు జూనియర్ ఎన్టీఆర్ . ఆ విషయంలో నిజంగా తాతకు తగ్గ మనవడే ఎన్టీఆర్..తారక్ ని ఢీకొట్టే మగాడేఅ ఇండస్ట్రీలో లేడు అని చెప్పడంలో సందేహమే లేదు..!