టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఇప్పటివరకు ఈ నటుడు ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఈయనకు ఈ మధ్య కాలంలో సరైన విజయం లేదు. తాజాగా ఈ నటుడు భైరవం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్ , నారా రోహిత్ కూడా హీరోలుగా నటించారు. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడం , అలాగే ఈ మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ లు హీరోలుగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో బిజినెస్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నాన్ ద్రియేటికల్ బిజినెస్ ద్వారా ఏకంగా 32 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అలా ఈ మూవీ కి నాన్ ద్రియేటికల్ హక్కుల ద్వారానే అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెయిన్ హీరో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినా కూడా ఈయన నటించిన మూవీ కి పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో ..? ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: