
రామ్ చరణ్ సినీ కెరీర్ లో సైతం రంగస్థలం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. చరణ్ సుకుమార్ కాంబో మూవీ ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది అనే క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వేర్వేరు కారణాల వల్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను వదులుకున్నారు.
అయితే చరణ్ తో సినిమా చేయాలని భావిస్తున్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఉన్నారు. త్రివిక్రమ్ చరణ్ తో ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చరణ్ తర్వాత సినిమా తనతోనే అని సుకుమార్ క్లారిటీ ఇవ్వడం ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది. చరణ్ సుకుమార్ కాంబో మూవీ ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. సుకుమార్ ఈ సినిమా తర్వాత పుష్ప3 సినిమాపై దృష్టి పెట్టనున్నారు.
బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ఉండదా అనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం లేదు. అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ విషయంలో గందరగోళం నెలెకొంది. హారిక హాసిని నిర్మాతల నుంచి సైతం ఇందుకు సంబంధించిన స్పష్టత అయితే రావడం లేదు. సుకుమార్ పారితోషికం భారీ స్థాయిలో ఉంది.