
టాలీవుడ్ లో సరైన సినిమాలు లేక రిలీజ్ అవుతున్న సినిమాలు హిట్లు కాకపోవడంతో ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టపోతున్నారు. ఈ యేడాది సంక్రాంతి పండుగ తర్వాత పైసా ఆదాయం చూడలేదని ఫిబ్రవరి నుంచి విపరీతమైన నష్టాలు వస్తున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రెండు మూడు లక్షల రూపాయల వరకు మెయింటినెన్స్ అవుతుందని .. ప్రతి నెల రెండు నుంచి మూడు లక్షలు నష్టం వస్తుందని అదే వాటాల విధానంలో అయితే సినిమా దెబ్బతిన్న ఎంతో కొంత చేతికి వస్తుంది అంటున్నారు ఎగ్జిబిటర్లు. హైదరాబాదులోని మెయిన్ థియేటర్లలో సైతం ఒక షోకు కనీసం 12 టిక్కెట్లు తెగితేనే షో ప్రదర్శిస్తున్నాం ... లేకపోతే షో వేయడం లేదని ఓ సీనియర్ ఎగ్జిబిటర్ చెపుతున్న మాట.
కనీసం పదిమంది పైన వస్తేనే షో వేస్తాం లేదంటే వేయం అని ప్రేక్షకులకు ముందుగానే చెప్పే టికెట్లు ఇస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. షో పడకపోతే టికెట్లు కొన్న వారికి డబ్బు వాపస్ ఇస్తున్నారు .. షో పడుతుందో లేదో అన్న సందేహంతో అరగంట ముందే ఏసీ వేస్తే వృధా అవుతుందని ఏసీ కూడా వేయటం లేదని వారు చెబుతున్న పరిస్థితి. అంటే కనీసం 12 మంది ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు థియేటర్లకు రాకపోతే ఇక థియేటర్ యజమానులు ... ఎగ్జిబిటర్లు ఎలా థియేటర్లో నడపాల అని తలలు పట్టుకుంటున్న వాతావరణం టాలీవుడ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు