ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాలీవుడ్ తార‌ల‌తో పాటు మ‌న ఇండియ‌న్ సెల‌బ్రిటీలు కూడా సంద‌డి చేస్తున్నారు. రెడ్ కార్పెట్ పై మెరిస‌న మ‌న తార‌ల్లో క‌న్న‌డ సోయ‌గం ప్రణీత సుభాష్ ఒక‌రు. డే 2 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శాంతను అండ్‌ నిఖిల్ డిజైన్ చేసిన రెడ్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్‌లో ఆమె క‌నిపించి ఆక‌ట్టుకుంది.
డీప్ ఫ్రెంట్ నెక్‌, సైడ్ క‌ట్ డ్రెస్‌లో ప్ర‌ణీత అంద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ హార్ట్ బీట్ పెంచేసింది. ప్ర‌ణీత తాజా స్ట‌న్నింగ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్‌లో ప్ర‌ణీత‌ను చూసి నెటిజ‌న్లు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. ఇద్ద‌రు పిల్ల‌లకు త‌ల్లంటే న‌మ్మ‌లేక‌పోతున్నామంటూ ప్ర‌ణీత అందాల‌ను పొగిడేస్తున్నారు.
బెంగుళూరులో డాక్ట‌ర్స్ ఫ్యామిలీలో జ‌న్మించిన ప్ర‌ణీత‌.. న‌ట‌న‌పై ఆస‌క్తితో యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. 2010లో పూరీ జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ `పోర్కి`తో కన్నడలోకి, `ఏం పిల్లో ఏం పిల్లడో` సినిమాతో తెలుగులోకి ఒకేసారి తెరంగేట్రం చేసింది. క‌న్న‌డ‌లో పోర్కి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో తొలి సినిమాతోనే ప్ర‌ణీత‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది.
అక్క‌డ వ‌రుస సినిమాల‌తో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇటు తెలుగులో `బావ‌`, `అత్తారింటికి దారేది`, `పాండవులు పాండవులు తుమ్మెద`, `ర‌భ‌స‌`, `డైనమైట్` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. కానీ టాలీవుడ్ లో ప్ర‌ణీత‌కు స‌రైన గుర్తింపు ద‌క్క‌లేదు.
ఇక‌పోతే 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్ర‌ణీత ఏడ‌డుగులు వేసింది. ఈ దంప‌తుల‌కు 2022లో ఒక‌ కూతురు, 2024లో ఒక కుమారుడు జ‌న్మించారు. అయితే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌ణీత గ్లామ‌ర్ కానీ, ఫిట్నెస్ కానీ చెక్కుచెద‌ర‌లేదు. అదే ఆమెకు అవ‌కాశాల‌ను తెచ్చిపెడుతోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: