
అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆ నలుగురు అంటూ రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయని ఆ నలుగురి చేతిలోనే ఇండస్ట్రీ ఉన్నట్టు చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదని ఆ నలుగురిలో నేను లేనని ఆయన కామెంట్లు చేశారు. 15 సంవత్సరాల క్రితం ఆ నలుగురు అనే మాట మొదలైందని ఆ తర్వాత నలుగురు పది మంది అయ్యారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
ఆ నలుగురు నిర్మాతలు పది మంది కావడాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదని ఆయన కామెంట్లు చేశారు. థియేటర్ల మూసివేత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని తన చేతిలో ఉన్న థియేటర్లు కేవలం 15 మాత్రమేనని ఆయన తెలిపారు. తెలంగాణలో తనకు ఒకే ఒక్క థియేటర్ ఉందని స్టాండ్ అలోన్ సినిమాలకు సమస్యలు ఉండటం వాస్తవమేనని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ తరహా నిర్ణయాలకు ఏకపక్షంగా వెళ్లడం సరికాదని అల్లు అరవింద్ అన్నారు. థియేటర్లకు సంబంధించి జరిగిన సమావేశాలకు నేను వెళ్లలేదని ఆయన తెలిపారు. పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు బంద్ చేస్తే అది దుస్సాహసమే అవుతుందని అల్లు అరవింద్ అన్నారు. పవన్ ను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ పేషీ నుంచి వచ్చిన లేఖ సమర్థనీయమని ఆయన కామెంట్లు చేశారు. అల్లు అరవింద్ చేసిన కామెంట్ల విషయంలో పవన్, బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.