
కెరీర్‌లో తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న కేతిక.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో రొమాన్స్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం `మాస్ జాతర` సినిమాతో బిజీగా ఉన్నా రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కిషోర్ తిరుమల దర్శకత్వంలో పట్టాలెక్కించబోతున్నారు. ఎస్. ఎల్. వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మొదట కథానాయిక పాత్ర కోసం కయాదు, మమితా బైజు వంటి పేర్లను పరిశీలించారు. అయితే ఫైనల్ గా సింగిల్ మూవీతో ఇటీవల హిట్ అందుకున్న కేతిక శర్మను ఖరారు చేసినట్టు ఫిలిం సర్కిల్స్ లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తి అయినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి `అనార్కలి` అనే టైటిల పరిశీలనలో ఉంది. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కామెడీ అండ్ యాక్షన్ కలయికలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు