
తన అన్న ఏఎం రత్నం అనారోగ్య సమస్యల పైన వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ వార్తలు అంటూ ఖండించారు. తన అన్న కళ్ళు తిరిగి పడిపోవడం పై ఎలాంటి నిజం లేదని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవంటూ క్లారిటీ ఇవ్వడంతో అటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కావాలనే కొంతమంది తన అన్న ఏఎం రత్నం పైన ఇలాంటి అనారోగ్య సమస్యల రూమర్స్ సృష్టించారంటూ ఫైర్ అయ్యారు దయాకర్ రావు.
హరిహర వీరమల్లు సినిమా ఐదేళ్ల తర్వాత వస్తూ ఉండడంతో రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక ఏం రత్నం పడిపోయారని కొంతమంది ఫేక్ న్యూస్ సృష్టించారని.. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటి రోజున రాత్రి నాలుగు గంటల పాటు సుమారుగా కంటిన్యూగా డబ్బింగ్ చెప్పారని..కీరవాణి డైరెక్షన్లోనే రీ రికార్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలియజేశారు దయాకర్ రావు. వాటన్నిటినీ కూడా తన అన్న ఏఎం రత్నం పరిశీలిస్తున్నారంటూ తెలియజేయడం జరిగింది. మొత్తానికి టాలీవుడ్లో ఈరోజు ఉదయం నుంచి వైరల్ గా మారిన ఈ విషయానికి చెక్ పెట్టారు దయాకర్ రావు.. ఈ సినిమా వచ్చే నెల 12న రిలీజ్ కాబోతోంది.