ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆయన నటించినా "ఖలేజా" సినిమా మళ్లీ రీ రిలీజ్ అవ్వడమే . అసలకే మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం బయటకు రాగానే ఆయన పేరు పాన్ వరల్డ్ స్థాయిలో మారుమ్రోగిపోయింది . కాగా ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది . ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు మహేష్ బాబు.  అంతేకాదు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీ రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్  కు కొత్త రకమైన ఫీలింగ్ కలుగజేస్తుంది .
 

మహేష్ బాబు నటించిన అన్ని సినిమాలలోకి ఖలేజా వెరీ వెరీ డిఫరెంట్ అని చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాను జనాలు పెద్దగా ఆదరించలేకపోయారు.  సినిమా రిలీజ్ అయిన మూమెంట్లో నెగిటివ్ టాక్ అందుకుంది.  ఈ సినిమా పెద్దగా కలెక్షన్స్ కూడా వసూలు చేయలేకపోయింది . అయితే ఎందుకు ఈ సినిమా ఆడడం ఆడలేదు అనే విషయం అప్పట్లో జనాలు ఎక్కువగా చర్చించుకున్నారు.  త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా డైరెక్ట్ చేశాడు అని ఈ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్ ఆటిట్యూడ్ వేరే లెవెల్ లో ఉన్నాయని అయినా కూడా అభిమానులని ఎందుకు ఆకట్టుకోలేకపోయింది అంటూ మాట్లాడుకున్నారు .



అయితే మహేష్ బాబుని దేవుడిగా చూపించడం జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు అన్న విషయం  జనాలకి బాగా అర్థమైంది . కాగా ఈ సినిమా రీ రిలీజ్ లో మాత్రం కుమ్మి పడేస్తుంది . కాగా ఈ సినిమా రి రిలీజ్ మూమెంట్లో ఓ అమ్మాయి ఫోటో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో కొంత భాగం రాజస్థాన్ లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయిన హీరో తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ కి వెళ్తాడు . అక్కడ మహేష్ బాబు చేసే కామెడీ అంతా అంతా కాదు.



మధ్యలో వచ్చిన "ఆలీ" తన కామెడీ లెవెల్ ను పిక్స్ కి తీసుకెళ్తాడు.  కొంతమంది ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్య నటించిన నటి గురించి అప్పట్లో తెగ ఆరా తీశారు . ఆ బ్యూటీ బాగా సినిమాకి హైలైట్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమెకి సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ "ఆమె ఎవరో చెప్పండి రా బాబు " అంటూ ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు . ఫైనల్లీ ఆమె ఎవరో తెలిసిపోయింది.  ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్ . ఆమె గతంలో చాలా సినిమాలలో కూడా నటించింది . కానీ పెద్దగా క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది . ప్రజెంట్ ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది . సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ దివ్య ఫోటోలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: