సినీ నటుడు సుమంత్ అనగనగా సినిమాతో ప్రేక్షకుల అలరించారు. ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి డైరెక్టర్ సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుమంత్, వ్యాస్ పాత్రలో ఎంతో సహజంగా నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఈ సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకుని.. మొదటిసారి ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా థియేటర్ లోకి రాబోతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక కథ నేర్పుతుంది. 

ఈ సినిమాలోని ప్రతి సీన్ గుండెకి హద్దుకునేలా ఉంది. మొత్తానికి అనగనగా మూవీ ప్రేక్షకులను ఏడ్పించేసింది. అయితే తాజాగా ఈ మూవీ డిలీటెడ్ సీన్స్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సీన్స్ అన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒక సీన్ లో రామ్, వ్యాస్ ని సింబా ముఫాసా కథ చెప్పమని అడగ్గా.. వ్యాస్ కథ చెప్పడం జరుగుతుంది. ఇంకో సీన్ లో రామ్ చదువు గురించి భాగీ బాధపడితే వ్యాస్ తనకి దైర్యన్ని ఇస్తాడు. ఇక ఈ డిలీటెడ్ సీన్స్ చూసిన నెటిజన్స్ అబ్బా.. ఈ సీన్స్ కూడా పెట్టి ఉంటే ఎంత బాగుండేది కదా అంటూ కామెంట్స్ తో నింపేస్తున్నారు.  
 
ఈ సినిమాలో (సుమంత్) వ్యాస్ అనే పాత్రను పోషించారు. వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పనిచేస్తారు. అదే స్కూల్ కి వ్యాస్ భార్య భాగ్య (కాజల్ చౌదరి) ప్రిన్సిపాల్ గా ఉంటుంది. బట్టీ చదువులు మంచిది కాదని పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలని నిత్యం స్కూల్ యజమాన్యంతో వాదిస్తూ ఉంటాడు. అలా వాదిస్తూ ఉద్యోగం కూడా కోల్పోతాడు. భార్య ప్రిన్సిపల్ అయినప్పటికీ మేనేజ్మెంట్ మాటకు కట్టుబడి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన వ్యాస్ ఏం చేశాడని.. చదువులో వెనుకబడిన స్కూల్ పిల్లలని ఎలా టాపర్ లుగా తీర్చిదిద్దాడనేది ఈ సినిమా కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: