మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక నిర్మాణంలో ఇటీవల వచ్చిన తొలి చిత్రం `కమిటీ కుర్రాళ్ళు`. కొత్త న‌టీన‌టుల‌తో యధు వంశీ తెర‌కెక్కిన ఈ మూవీ ఎటువంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద హిట్ గా నిలిచింది. భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. తొలి చిత్రం అయిన‌ప్ప‌టికీ నిర్మాణంలో నిహారిక ఎక్క‌డ రాజీప‌డ‌లేదు. ఫ‌లితంగా ఈ సినిమాను తాజాగా రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వ‌రించాయి.

సుమారు 14 ఏళ్ల గ్యాప్ అనంతరం తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట రాష్ట్ర సినీ అవార్డులను ప్రకటించింది. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు వచ్చింది. అలాగే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా యధు వంశీ కూడా అవార్డు అందుకోనున్నాడు. గద్దర్ అవార్డుల్లో కమిటీ కుర్రాళ్ళు స‌త్తా చాట‌డంతో నిహారిక మ‌రియు చిత్ర‌బృందం ఆనందంలో మునిగిపోయారు.

ఇక‌పోతే నిహారిక తండ్రి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నిర్మాత‌గా చేసిన తొలి చిత్రం `రుద్రవీణ`. మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా న‌టించారు. 1988 లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా జాతీయ సమైక్యతపై ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ అవార్డు అందుకుంది. నిహారిక నిర్మాతగా తీసిన తొలి సినిమాకు జాతీయ సమైక్యత గద్దర్ అవార్డు రావడం, నాగబాబు నిర్మాతగా తీసిన తొలి సినిమాకు జాతీయ సమైక్యత నేషనల్ అవార్డు రావడం నిజంగా యాదృచ్ఛికమే. తండ్రీకూతుళ్లు నిర్మాత‌గా చేసిన‌ మొద‌టి సినిమాకు ఒకే కేట‌గిరీలో అవార్డులు సొంతం చేసుకున్నారు. నాడు నాగ‌బాబు, నేడు నిహారిక విషయంలో సేమ్ టు సేమ్ జ‌ర‌గ‌డంతో మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: