
ఈ కామెంట్స్ పై కమలహాసన్ క్షమార్పణలు చెప్పి తీరాలని కన్నడ భాషా సంఘాలు అన్నీ ఒక్కసారిగా తమ ఉధ్యమాన్ని తీవ్రం చేయడంతో ఈమూవీని కొనుక్కున్న కన్నడ బయ్యర్లు తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణిగే దాకా కన్నడ రాష్ట్రంలో ఈసినిమాను నిలిపివేస్తామని కన్నడ సంఘాలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆ హెచ్చరికలను పట్టించుకునే స్థితిలో లేనట్లుగా అంచనాలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంతో కన్నడ ప్రజలు ఆరాధించే రాజకుమార్ కొడుకు శివరాజ్ కుమార్ కూడ నలిగిపోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య కమల్ మీడియా సంస్థలతో మాట్లాడుతూ తాను కొన్ని వందల సంవత్సరాల క్రితం కన్నడ భాషకు సంబంధించిన భాష ప్రముఖులు చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని తాను కామెంట్స్ చేశానని తాను చేయని తప్పుకు క్షమార్పణ ఎందుకుకు చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.
ఇలా ప్రవర్తించడం వెనుక కమల్ ఆలోచన వేరు అని అంటున్నారు. అయితే దీనితో కమల్ తన సినిమా కర్ణాటక రాష్ట్రంలో విడుదల అవ్వకపోయినా ఫర్వాలేదు అన్న మితిమీరిన ఆత్మ విశ్వాసం అనుకోవాలా లేదంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని కమలహాసన్ వ్యూహం అనుకోవాలా అన్న విషయం తేల్చుకోలేక ఇప్పటికే ఈసినిమా కొనుక్కున్న బయ్యర్లు విపరీతంగా టెన్షన్ పడుతున్న పరిస్థితులలో ఈమూవీ కన్నడ బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలతో పాటు ఎప్పుడు మీడియాతో తాను సన్నిహితంగా మాట్లాడే కమలహాసన్ ఈ చిన్న విషయాన్ని ఎందుకు లాగదీస్తున్నారు అంటూ సగటు ప్రేక్షకుడుకి సమాధానం దొరకక ఆనాటి తరం మరియు నెటితరం ప్రేక్షకులు కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు టాక్..