
కోలీవుడ్ నుంచి రాబోతున్న మరో మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో దర్శకుడు ఏఆర్ మురగదాస్ , అలాగే టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ కాంబోలో వస్తున్న సాలిడ్ యాక్షన్ మూవీ ‘మదరాసి’ కూడా ఒకటి .. అయితే ఈ సినిమా ప్రకటించి అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్స్ , గ్లింప్స్ తోనే తమిళ్ సహా తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు పెంచేసింది .. అయితే ఇప్పుడు ఇలా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఊహించని లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి బయటకు వచ్చింది .
తాజా గా అందుతున్న అప్డేట్ ప్రకారం ఇప్పటికే ఈ చిత్రం క్లైమాక్స్ సీక్వెన్స్ తో ఫైనల్ షెడ్యూల్ ని కంప్లీట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది . అలాగే ఈ షెడ్యూల్ శ్రీలంక లో ప్లాన్ చేశారట .. ఇక మురుగదాస్ తుపాకీ .. విలన్ విద్యుత్ జమ్వల్ , శివ కార్తికేయన్ మధ్య ఓ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్ ని మురుగదాస్ తెరకెక్కించబోతున్నారట .. అయితే మురుగదాస్ గత మూవీ సికిందర్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది . అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రభావం మదరాసి మీద పెద్ద గా కనిపించడం లేదు . ఇక మరి ఈ సినిమా తో ఏ ఆర్ మురుగదాస్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు