
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి విలువ సుమారు రూ. 50 కోట్లు. బంజారా హిల్స్‌లోని 22 ఎకరాల స్థలంలో ఏఎన్నార్ గారు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ కు నాగార్జున అధినేతగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ విలువ దాదాపు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా ఉంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు, హోటల్స్, పబ్‌లు వంటి వ్యాపారాలు నాగార్జున కలిగి ఉన్నారు.
అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టిన నాగార్జునకు హైదరాబాద్‌లోనే స్థిరాస్తులు కూడా ఉన్నాయి. మరోవైపు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ జట్టుకు యజమానిగానూ ఉన్నారు. నటుడిగా ఒక్కో సినిమాకు రూ. 20 నుండి 25 కోట్లు ఛార్జ్ చేస్తోంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేస్తూ ప్రతి ఏడాది రూ. 25 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. నాగార్జున వద్ద పలు లగ్జరీ కార్లతో పాటు ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈ జెట్ విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మొత్తంగా నాగార్జున ఆస్తుల విలువ రూ. 3050 కోట్లు. నటుడిగా, హోస్ట్‌గా, నిర్మాతగానే కాకుండా ఇతర వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా కూడా నాగార్జున తన ఆస్తులను భారీగా పెంచుకుంటున్నారు.