
2015లో రాజ్ పలు హిందీ చిత్రాలకు రచన మరియు దర్శకత్వ శాఖల్లో పనిచేసిన శ్యామలి డేను వివాహం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ జంట విడాకుల బాట పట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్, సమంత ప్రస్తుతం సైలెంట్ గా సహజీవనం చేస్తున్నారని.. వన్స్ చట్టపరంగా రాజ్‌కు విడాకులు వచ్చిన వెంటనే సమంతతో కలిసి ఏడడుగులు వేయనున్నాడని నెట్టింట వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే తరచూ సమంత రాజ్ తో ఉన్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
అయితే ఇంత వరకు అటు రాజ్ కానీ, ఇటు సమంత కానీ తమ రిలేషన్ పై ఓపెన్ అవ్వలేదు. ఫుల్ సెలెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు రాజ్ సతీమణి శ్యామలి డే మాత్రం తన ఆక్రోశాన్ని, ఆవేశాన్ని పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా బయట పెడుతోంది. ఈ పరిణామాలను చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజ్, సమంత వివాహం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ జంట మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. రాజ్ నిడిమోరు వయసు 45 కాగా.. సమంతకు 38 సంవత్సరాలు. ఈ లెక్కన ఇద్దరి మధ్య దాదాపు ఏడేళ్ల వయసు వ్యత్సాసం ఉంది. కాగా, ప్రేమకు ఏజ్‌లో సంబంధం లేదని ఎందరో కపుల్స్ రుజువు చేశారు. మరి ఆ జాబితాలో సమంత-రాజ్ కూడా చేరతారేమో చూడాలి.