
ఐదు దశాబ్దాల ప్రయాణంలో 8,600కి పైగా పాటలు మరియు 1,500కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో పాటు 5 సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటికీ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. అయితే ఈ మధ్య చేసే చిత్రాల్లో ఇళయరాజా మార్క్ కనిపించడం లేదన్నది వాదన ఉంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇళయరాజా ఆస్తులు కూడా బాగానే సంపదించారు. చెప్పాలంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఆయన ముందు దిగదుడుపే.
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా ఒక్కో చిత్రానికి రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. `ఇళయరాజా అఫీషియల్` అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయనకు నెలకు సుమారు రూ. 22 లక్షలు ఆదాయం వస్తోంది. అలాగే ఆయన స్వరపరిచిన పాటలకు హక్కులు ఇప్పటికీ మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. టీవీ, రేడియో, ఓటీటీ, యూట్యూబ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆయన పాటలు ప్రసారమయ్యే ప్రతిసారీ ఇళయరాజాకు రాయల్టీ వస్తుంది.
అదేవిధంగా ప్రతి ఏడాది ఇళయరాజా లైవ్ కచేరీలు చేస్తుంటారు. ఆయన లైవ్ సంగీత కార్యక్రమాలకు వేలల్లో అభిమానులు హాజరవుతారు. దాంతో ఒక్కో లైవ్ కాన్సర్ట్ కు రూ. 1 కోటి నుంచి 3 కోట్లు సంపాదిస్తారు. చెన్నై, ముంబయి, మధురై వంటి నగరాల్లో ఇళయరాజాకు ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. ఇక ఇళయరాజా మొత్తం ఆస్తుల విలువ రూ. 790 కోట్లు అని పలు నివేదికలు చెబుతున్నాయి.