
రాష్ట్రంలో ఉన్న సింగిల్ స్క్రీన్లలో కొన్ని స్క్రీన్లను మల్టీప్లెక్స్ లుగా మార్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని భోగట్టా. హైదరాబాద్ లో ఉన్న పలు సింగిల్ స్క్రీన్లకు సంబంధించి ఈ నిర్ణయం అమలు కానుందని తెలుస్తోంది. ఈ విధంగా మల్టీప్లెక్స్ లుగా మార్చడం వల్ల భారీ లాభాలు సొంతం చేసుకోవాలని థియేటర్ల ఓనర్లు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీకి ఎంతమేర మేలు జరుగుతుందో చూడాలి.
అయితే ఈ విధంగా చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసి నిర్మాతలు భారీ లాభాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నైజాం సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు ఈ దిశగా అడుగులు వేస్తే నిర్మాతల రియాక్షన్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. నైజాం ఏరియాలో రాబోయే రోజుల్లో థియేటర్లకు సంబంధించి ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
ప్రస్తుతం పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు నైజాం ఏరియా కలెక్షన్ల విషయంలో కీలకం అవుతోంది. నైజాం ఏరియాకు వచ్చే కలెక్షన్లలో మెజారిటీ కలెక్షన్లు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. నైజాం సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. నైజాం ఏరియాలో పెద్ద సినిమాల హక్కులు 40 కోట్ల రూపాయలకు పైగా పలుకుతున్నాయి. నైజాం ఏరియాలో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఉండటం కూడా కొంతమేర మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.