
థగ్ లైఫ్ ఆడియో లాంచ్‌లో కమల్ హాసన్ కన్నడ భాష గురించి తక్కువ చేసి మాట్లడటంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే థగ్ లైఫ్‌పై కర్ణాటక్ ఫిల్మ్ ఛాంబర్ నిషేధం విధించింది. అయితే ఈ వివాదం మిగతా భాషల్లో సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేయడంతో అన్ని చోట్లు ఆన్‌లైన్‌లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇకపోతే థగ్ లైఫ్ బడ్జెట్ ఎంత..? కమల్ హాసన్, శింబు, త్రిష, డైరెక్టర్ మణిరత్నం ఏ రేంజ్ లో రెమ్యునరేషన్స్ ఛార్జ్ చేశారు..? అన్న విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1987లో రిలీజ్ అయిన `నాయకన్` తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన చిత్రమే థగ్ లైఫ్. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. నిర్మాతలు కమల్ హాసన్, మణిరత్నమే కావడంతో.. వారు ప్రత్యేకంగా ఏమీ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అయితే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన శింబు భారీ ఛార్జ్ చేశారు. ఆయన రూ. 40 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్ త్రిష రూ.12 కోట్లు తీసుకున్నారని టాక్. ఆమె కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ గా చెప్పుకోవచ్చు.