
పెద్ది సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో యాక్షన్ షాట్స్ కు పెద్ద పీట వేశారని భోగట్టా. చరణ్ జాన్వీ మధ్య సీన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. పెద్ది సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందని తెలుస్తోంది. త్వరలో పెద్ది సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది.
పెద్ది సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుండగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పెద్ది సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. పెద్ది సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమాకు పోటీ కూడా ఉండదని భోగట్టా.
డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బుచ్చిబాబు ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో కూడా భవిష్యత్తులో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.