
టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడిగా .. స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. ఒకప్పుడు శ్రీను వైట్లతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ లో స్టార్ హీరోలు క్యూ లో ఉండేవారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఆయన తెరకెక్కించారు. అయితే మహేష్ బాబు తో తెరకెక్కించిన ఆగడు సినిమా నుంచి శ్రీను వైట్ల ట్రాక్ పూర్తిగా గాడి తప్పింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయనను స్టార్ హీరోలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజతో అమర్ అక్బర్ అంటోనీ చేసిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వైట్ల చివరిసారిగా గోపీచంద్ హీరోగా విశ్వం సినిమా తర్కెక్కించారు.
ఈ సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్న బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. శ్రీను వైట్ల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ? చేస్తాడా అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రీను వైట్ల తర్వాత సినిమాకి మేకర్స్ కన్ఫర్మ్ అయినట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల తనకు ఎంతో పట్టున్న కామెడీ ఎంటర్టైనర్ కథతో తన తర్వాత సినిమాలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ మరోసారి ఫామ్ లో లేని శ్రీను వైట్లకు ఛాన్స్ ఇవ్వడం గ్రేట్‌గానే చెప్పాలి. మరి ఈ సినిమాతో అయినా శ్రీను వైట్ల ఎలాంటి విజయం అందుకుంటాడో ? చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు