అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయ్యింది .. అక్కినేని మన్మధుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్  వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు .  తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బాయ్ చెబుతూ తన ప్రియురాలు  జైనాబ్ తో కలిసి తన దాంపత్య జీవితానికి స్వాగతం పలికాడు .. తాజాగా జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో శుక్రవారం అనగా ఈరోజు ఉదయం 3 గంటలకు వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది .. అలాగే ఇరు కుటుంబ సభ్యులు , సన్నిహితులు , సినీ తరులు ఈ వేడుకలో పాల్గొన్నారు .. అలాగే పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో  హీరో నాగచైతన్య ఎంతో హుషారుగా  పాల్గొన్న ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ..


అఖిల్ జైనాబ్‌ పెళ్లి వేడుకకు మన టాలీవుడ్ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు , రామ్ చరణ్ , ఉపాసన దర్శకుడు ప్రశాంత్ నీల్ , హీరో సుశాంత్ సహ తదితరులు హాజరైనట్టు తెలుస్తుంది ... అలాగే జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా అఖిల్ అక్కినేని రిసెప్షన్ వేడుక కూడా జరగనుంది .. ఈ వేడుక కు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలు , రాజకీయ నాయకులు అందరూ పాల్గొంటారు అని కూడా తెలుస్తుంది . అయితే అఖిల్ పెళ్లి వేడుకల్లో మాత్రం నాగచైతన్య , అఖిల్ వదిన శోభిత అందరికన్నా ఎంతో హైలెట్గా నిలిచారని అంటున్నారు .  అలాగే ఈ పెళ్లి వేడుకని ఇద్ద‌రు తామ భుజాలపై వేసుకొని ఎంతో అట్టహస‌కంగా నిర్వహించార‌ని కూడా అంటున్నారు .. ఇక‌ వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..



మరింత సమాచారం తెలుసుకోండి: