ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో లేఆఫ్‌ల ద్వారా అమెజాన్ వార్తల్లో నిలవగా, ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సుమారు 1800 మంది ఇంజనీర్లను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ తొలగింపులు క్లౌడ్ సర్వీసెస్, రిటైల్, గ్రోసరీ, ఇతర ముఖ్య విభాగాల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. ఈ పరిణామం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకమని, ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును శాసిస్తుందని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ లేఆఫ్‌లు ఏఐ-ఆధారిత విభాగాల ఏర్పాటుకు, సాంకేతికతపై మరింత దృష్టి పెట్టడానికి అనుగుణంగా ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా, టెక్ ప్రపంచంలో వరుసగా జరుగుతున్న ఈ ఉద్యోగుల తొలగింపులు కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి