
దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ వంటి పేర్లను కథానాయికి పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ మూవీలో ఓ సీనియర్ బ్యూటీని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. ఇంతకీ ఆమె మరెవరో కాదు ప్రియమణి. సౌత్ తో పాటు నార్త్‌లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రియమని.. హీరోయిన్ రోల్స్ కే పరిమితం కాకుండా బలమైన సహాయక పాత్రలను కూడా పోషిస్తూ సత్తా చాటుతోంది.
అట్లీ చివరగా బాలీవుడ్ లో రూపొందించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `జవాన్` మూవీలోనూ ముఖ్యమైన పాత్రలో ప్రియమణి మెరిసింది. ఇప్పుడు బన్నీ సినిమాలోనూ జాక్‌పాట్ లాంటి ఆఫర్ కొట్టిందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. కాగా, గతంలో ఓ షోలో ప్రియమణి మాట్లాడుతూ.. చాలా మంది స్టార్స్‌లో కలిసి నటించాను, కానీ బన్నీతో యాక్ట్ చేసే అవకాశం రాలేదని ఓపెన్ అయిపోయింది. అందుకు బన్నీ తప్పకుండా కలిసి వర్క్ చేద్దామని హామీ ఇచ్చాడు. పైగా మీ వయసేం అయిపోలేదు.. ఇప్పటికీ హాట్‌గానే ఉన్నారంటూ బన్నీ కాంప్లిమెంట్ కూడా ఇవ్వడంతో ప్రియమణి తెగ మురిసిపోతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు