బండారు సుప్రిత‌.. ఈ సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురే అయిన సుప్రిత త‌న‌దైన గ్లామ‌ర్ తో సోష‌ల్ మీడియా ద్వారా విప‌రీత‌మైన పాపుల‌రిటీ సంపాదించుకుంది. టీవీ షోలు, ఈవెంట్స్‌లో సంద‌డి చేస్తూ మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. `మ‌నీ మైండెడ్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌` అనే షార్ట్ ఫిల్మ్ తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన సుప్రిత‌.. `చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి` చిత్రంతో హీరోయిన్ గా వెండితెర‌పై అడుగుపెట్ట‌బోతుంది.


మాల్యాద్రి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ అమ‌ర్‌దీప్ హీరోగా న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే సుప్రిత డెబ్యూ ఫిల్మ్ విడుద‌ల కాబోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. త‌ల్లి సురేఖా వాణితో క‌లిసి సుప్రిత త‌ర‌చూ పార్టీలు, వెకేష‌న్స్‌ అంటూ ఎంత‌లా చిల్ అవుతుంటుందో సోష‌ల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఫారెన్ కంట్రీస్ లో చిట్టిపొట్టి దుస్తులు ధ‌రించి త‌ల్లీకూతుళ్లు చేసే హంగామా నెక్స్ట్ లెవ‌ల్. అయితే వెకేష‌న్స్ పేరుతో అస్త‌మాను ఫారిన్స్ టూర్స్ కు వెళ్ల‌డానికి వీరికి డ‌బ్బు ఎక్క‌డ నుండి వ‌స్తున్నాయ‌న్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంది.


ఎందుకంటే, ఒక‌ప్పుడు చేతి నిండా సినిమాల‌తో బిజీ న‌టిగా రాణించిన సురేఖా వాణి.. భ‌ర్త చ‌నిపోయాక చాలా డిస్టర్బ్ అయ్యారు. ఆ త‌ర్వాత సినిమాలు చేయ‌డం పూర్తిగా త‌గ్గించేవారు. మ‌రి సురేఖా వాణి, ఆమె కూతురు అంత ల‌గ్జ‌రీ లైఫ్ ను ఎలా లీడ్ చేస్తున్నారు? ఫారిన్ టూర్స్ వెనుక మిస్ట‌రీ ఏంటి? డ‌బ్బులు ఎక్క‌డ నుంచి వ‌స్తున్నాయి? అన్న విష‌యాల‌పై తాజాగా సుప్రిత ఓపెన్ అయింది.


ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఫాలోవర్స్ కారణంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ తాను సంపాదిస్తున్నాన‌ని.. అలా వచ్చిన డబ్బుల్లో కొంత తన తల్లికి ఇచ్చేస్తాన‌ని.. మిగిలిన డబ్బులతో అప్పుడ‌ప్పుడు టూర్స్ వేస్తుంటామ‌ని సుప్రిత చెప్పుకొచ్చింది. వ‌ర్క్ ప్రెజ‌ర్ ఇత‌ర టెన్ష‌న్స్ నుంచి రిలాక్స్ అవ్వ‌డానికి వెకేష‌న్స్ బాగా హెల్ప్ అవుతాయ‌ని.. అందుకే మాకున్న‌ స్తోమతలోనే  టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తామ‌ని సుప్రిత పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: