టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్ లో ఓ పాన్ ఇండియా మూవీ సెట్ అయిన సంగ‌తి తెలిసిందే. పూరి కెరీర్ కు లైఫ్ అండ్ డెత్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాతో ఎలాగైన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని పూరి భావిస్తున్నారు. ఓ స‌రికొత్త క‌థాంశంతో మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్క‌న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జోరుగా సాగుతున్నారు. జూన్ ఆఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.


విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ప్ర‌ముఖ హీరోయిన్ నివేదా థామస్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. పూరి - విజ‌య్ కాంబో మూవీకి `బెగ్గ‌ర్‌` అనే టైటిల్ ఖారారు ఖానుందంటూ సోష‌ల్ మీడియాలో గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్ సేతుప‌తిని నేరుగా ప్ర‌శ్నించ‌గా.. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేద‌ని ఆయ‌న తెలిపారు.


అయితే తాజాగా పూరి - విజ‌య్ మూవీకి మ‌రో విచిత్ర‌మైన టైటిల్ తెర‌పైకి వ‌చ్చింది. మొద‌ట బెగ్గ‌ర్ టైటిల్‌నే మేక‌ర్స్ అనుకున్నార‌ట‌. కానీ ఇప్పుడు బెగ్గ‌ర్ కాదు.. `భవతీ భిక్షాందేహి` అనే టైటిల్ పెట్టాల‌ని డైరెక్ట‌ర్ పూరి ఆలోచ‌న చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, త్వ‌ర‌లో సెట్స్ మీద వెళ్ల‌నున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. పూరి, విజ‌య్ కాంబోపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ ఏర్ప‌డింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: