ఒక సినిమా 100 రోజులు ఆడాలంటే టాక్ ఎంత అద్భుతంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఓ డిజాస్ట‌ర్‌ మూవీ 100 రోజులు ఆడిందంటే నమ్ముతారా? అటువంటి రేర్ రికార్డ్ నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఉంది. `లారీ డ్రైవర్`, `రౌడీ ఇన్స్పెక్టర్` వంటి బ్లాక్ బస్టర్స్ అలాగే `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి ఇండస్ట్రీ హిట్స్ అనంతరం బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రం `పల్నాటి బ్రహ్మనాయుడు`. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. వెంకట రమణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మేడికొండ మురళీకృష్ణ నిర్మించిన పల్నాటి బ్రహ్మనాయుడు 2003 జూన్ 5న విడుదలైంది.


అప్పటికే `భలే వాడివి బాసూ`, `సీమ సింహం`, `చెన్నకేశవరెడ్డి` చిత్రాల‌తో బాల‌య్య కెరీర్ కొంచెం డౌన్ అయింది. అటువంటి స‌మ‌యంలో బి.గోపాల్ డైరెక్ట్ చేసిన పల్నాటి బ్రహ్మనాయుడు రిలీజ్ కు రెడీ అవ్వ‌డంతో అంచ‌నాలు తారా స్థాయిలో ఏర్ప‌డ్డాయి. ఈ మూవీతో బాల‌య్య స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తార‌ని ఫ్యాన్స్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంతో పూర్తిగా విఫ‌లం అయింది.
బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అనుకుంటే డిజాస్ట‌ర్ గా నిలిచింది. హీరో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, హీరో పిల‌వ‌గానే విల‌న్ కూర్చున్న‌ కుర్చీ ముందుకు రావడం, కోడిపుంజు వెళ్ళి రౌడీ ని చంపడం.. ఇటువంటి సీన్లు ప్రేక్ష‌కుల‌కు వెగ‌టు పుట్టించాయి. అటు బాల‌య్య‌, ఇటు బి.గోపాల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. అయితే పలనాటి బ్రహ్మనాయుడు సినిమా ఎంత డిజాస్టర్ అయిన కూడా 92 కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అంటే అప్ప‌ట్లో బాల‌య్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: