- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన థ‌గ్ లైఫ్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాదాపు మూడున్నర దశాబ్దల తర్వాత కమలహాసన్ - మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాటు ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ త్రిష , సీనియర్ హీరోయిన్ అభిరామి , కోలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు శింబు అందరూ కలిసి నటించారు. దీనికి తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. గ‌తంలో క‌మ‌ల్ - మ‌ణి కాంబోలో వ‌చ్చిన నాయ‌క‌న్ ( తెలుగులో నాయకుడు ) సినిమా గ్యాంగ్ స్టార్ కథాం శంతో తెరకెక్కి సూపర్ హిట్ కావడంతో పాటు థ‌గ్ లైఫ్‌ సినిమా కూడా మరోసారి గ్యాంగ్ స్టార్ కథాంశంలో ప్రేక్షకుల ముందుకు రావడంతో సహజంగానే భారీ అంఛనాలు ఉన్నాయి.


అయితే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మూడు రోజుల్లో 28.49 కోట్ల నెట్‌ వసూళ్లు మాత్రమే వచ్చాయి. తొలిరోజు 15 కోట్లు - రెండో రోజు ఏడు కోట్లు - మూడో రోజు 5.84 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. అంచ‌నాలు అందుకోలేకపోవడంతో పాటు మణిరత్నం మ్యాజిక్ మిస్ కావడం దెబ్బ కొట్టింది. హిందీలో హౌస్ఫుల్ 5 రిలీజ్ కావటం ... కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయకపోవడం లాంటి అంశాలు కూడా ఈ సినిమా వసూళ్లపై పెను ప్రభావం చూపించిందని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: