
అది పెద్ద పాన్ ఇండియా స్టార్ట్ అయిన సరే ఈ మధ్యకాలంలో అలాంటి ఒక విషయం మనం బాగానే విన్నాం . అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఎఫెక్ట్ కారణంగా హీరోయిన్స్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలి అంటేనే భయపడిపోతున్నారు . సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ దీపిక పదుకొనే హై రెమ్యూనరేషన్ అడిగింది అన్న కారణంగా తన సినిమా నుంచి తీసేసారు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. ఇప్పుడు మేము అంత రెమ్యూనరేషన్ అడిగితే మేకర్స్ మమ్మల్ని కూడా సినిమాలో నుంచి తీసేస్తారు ఏమో అన్న భయంతో హీరోయిన్స్ వణికి పోతున్నారు.
మేకర్స్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తే అంత తీసుకోలేరు . అలా అని డిమాండ్ చేయలేక మధ్యలో నలిగిపోతున్నారు కొందరు బ్యూటీస్ . మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ తమ రేంజ్ కి తమ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఒక రెమ్యూనరేషన్ ఫిక్స్ అయి ఉంటారు . ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేకర్స్ . మొత్తానికి సందీప్ రెడ్డి వంగ ఎఫెక్ట్ కి కొంత మంది హీరోయిన్స్ బాగా భయపడిపోతున్నారని అంటున్నారు సినీ పెద్దలు. చూడాలి మరి ఇండస్ట్రీలో నెక్స్ట్ హీరోయిన్స్ ఎలా మారుతారు అనేది ..? కేవలం రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేసే హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే మంచిది అంటున్నారు కొంతమంది కుర్రాళ్ళు..!!