ఈనెల విడుదల కాబోయే భారీ బడ్జెట్ చిత్రాల్లో `కన్నప్ప` ఒకటి. మంచు విష్ణు టైటిల్ పాత్రలో మోహన్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్‌ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. జూన్ 27న కన్నప్ప విడుదల కాబోతుంది. ప్రస్తుతం మంచు విష్ణు ఈ చిత్రాన్ని జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. సినిమాపై హైప్‌ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.


ఇదిలా ఉంటే.. తాజాగా కన్నప్ప గురించి మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంచు లక్ష్మికి కన్నప్పలో మీరెందుకు నటించలేదు అన్న ప్రశ్న ఎదురయింది. అందుకు ఆమె.. `నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన మిగతా న‌టులెవరు కనిపించరు` అంటూ సరదాగా కామెంట్ చేసింది. `కన్నప్పలో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతో విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ అటువంటి పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. అయిన‌ మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది` అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.


కాగా, గత కొద్ది రోజుల నుంచి మంచు బ్రదర్స్ అయిన విష్ణు, మనోజ్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంచు లక్ష్మి పెద్దగా కలగ చేసుకోలేదు. ఆమె ముంబైకే ప‌రిమితం అయింది. తాజా ప్రెస్ మీట్ లో మీ సోదరులకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అని ప్రశ్నించగా.. `సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవడానికి సపోర్ట్ చేయకపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్లకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది` అని మంచు లక్ష్మి సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: