
అటు తిరిగి ఇటు తిరిగి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అతని ప్రేయసి రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి మెడకు చుట్టుకుంది. వీరిద్దరూ సుశాంత్ కేసులో అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. సుశాంత్ ను సూసైడ్ దిశగా ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దాదాపు నాలుగేళ్ల విచారణ అనంతరం రియా చక్రవర్తి మరియు ఆమె సోదరు క్లీన్ చిట్ కూడా తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ పరంగా మళ్లీ పుంజుకునేందుకు రియా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.కానీ మునపటిలా ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రియా చక్రవర్తి.. సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు ఎదుర్కొన బాధను బయటపెట్టింది. `సుశాంత్ మరణంతో మా ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. నాకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. నా తమ్ముడు షోయిక్ క్యాట్ 96% సాధించినప్పటికీ అరెస్ట్ అయిన కారణంగా ఎంబీఏ కోర్సులో చేరలేకపోయాడు. కనీసం ఏదైనా కార్పొరేట్ కంపెనీలో ఉదయం పొందడం కూడా చాలా కష్టమైంది. ఎటువంటి తప్పు చేయకపోయిన నా కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది. అసలు మా జీవితాలు ఎటు వెళ్తున్నాయో కూడా కొద్ది రోజులు అర్థం కాలేదు. సుశాంత్ కేసులో క్లీన్ చిట్ వచ్చాక మా మనసుకు ప్రశాంతత లభించింది` అంటూ రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.