
అయితే ఈమె రూట్ లోనే నేను ఉన్నాను అంటుంది పూజ హెగ్డే .. కెరియర్ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇతర మార్గాల కోసం చూడటం కామన్ .. కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్స్ అయింది పూజ హెగ్డే .. ఇప్పటివరకు వెబ్ సిరీస్ వైపు చూడలేదు టైముంటే టూర్ లు వెళ్తున్నారు కానీ ఓటీటీల మీద మాత్రం తన దృష్టి పెట్టడం లేదు .. ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేషనల్ క్రాష్ రష్మిక కూడా ఇందులో ఎంట్రీ ఇవ్వలేదు .. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా సబ్జెక్టులు వినడానికే సరిపోతుంది రష్మిక మందన్నాకు .. అలా ఆయా కథలకు తగ్గట్టు లుక్స్ మార్చుకోవటం ప్రమోషన్లకు వెళ్ళటం సెట్లో ఆన్ టైంలో ఉండటం ఇవన్నీ రష్మిక ముందున్న ప్రయారిటీస్ వీటన్నిటిని దాటుకుని ఓటీటీల వైపు కాన్సెంట్రేట్ చేసే సమయం ఈ బ్యూటీ కి లేదు ..
అలాగే మరో యంగ్ బ్యూటీ శ్రీలీల మనసులోనూ ఇదే ఉందట .. రీసెంట్గా చదువు కోసం ఈ అమ్మడు కొంత గ్యాప్ తీసుకుంటేనే ఒప్పుకోలేక పోయారు ఆమె అభిమానులు అలాంటిది వెబ్ సిరీస్ లు అంటూ సినిమాలు గ్యాప్ ఇస్తే ఊరుకుంటారా .. అందుకే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది శ్రీలీల .. అలాగే స్టార్ బ్యూటీ అనుష్క కూడా ఇప్పటివరకు వెబ్ సిరీస్ ల వైపు చూడలేదు .. ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటూ వెండి తెరపై తన జర్నీ కంటిన్యూ చేస్తున్నారు అనుష్క .. త్వరలోనే లేడీ ఓరియంటెడ్ ఘాటీతో మరోసారి వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు .