
దర్శకుడు మారుతి స్వతహాగా మంచి రచయిత .. ఎంతో వేగంగా స్టోరీని పూర్తి చేయగలడు కాబట్టి స్టోరీలు కొన్ని ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి . ఇక అవన్నీ ఇప్పుడు తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆ స్టోరీలన్నీ బయట దర్శకుల చేతుల్లో పెట్టబోతున్నారు .. ఈ రీసెంట్ టైమ్స్ లో మంచి విజయాలు అందుకున్న యంగ్ దర్శకులు ఈ కథలన్నీ తెరపైకి తీసుకువస్తున్నారు . ఈ వివరాలు కూడా త్వరలోనే బయటకు రాబోతున్నాయి .. ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాజాసాబ్ పూర్తయ్యాక ఏ హీరోతో సినిమా చేయాలన్న విషయంలో కూడా మారుతి ఇప్పటికే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది .. ప్రభాస్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు .. అలాగే ‘రాజాసాబ్ 2 ఆలోచన ఉన్నప్పటికీ .. ఇది ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు .. అలా మధ్యలో మరో సినిమా చేశాకే .. పార్ట్ 2 రానుంది .
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు