
కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ – టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కుబేర. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా భారీ మల్టీస్టారర్ సినిమాగా .. భారీ అంచనాలతో థియేటర్ల లోకి వచ్చింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు యునానమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. షో షో కు టిక్కెట్ల బుకింగ్స్ జోరు మామూలుగా లేదు. ఇక కలెక్షన్లు కూడా అంచనాలకు మించి పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నైజాంలో అయితే కుబేర సినిమా కలెక్షన్లు కుమ్ముకుంటోంది. లేటెస్ట్ గా నైజాం వసూళ్ల సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ల లెక్కలు బయటకు వచ్చాయి. నైజాం ఏరియాలో ‘కుబేర’ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే పెర్పామ్ చేస్తోంది.
ఇక నైజాం లో ఫస్ట్ డే రూ. 2.7 కోట్ల (జీఎస్టీ తో సహా) షేర్ సాధించింది. ఇక రెండో రోజు శనివారం కలెక్షన్లు మరింత పెరిగాయి. రెండో రోజు రూ. 3.2 కోట్ల ( జీఎస్టీ తో సహా) షేర్ రాబట్టింది. ఓవరాల్ గా రెండు రోజులకు గానూ రూ. 5.9 కోట్లను ( జీఎస్టీతో సహా ) రాబట్టింది. మొత్తానికి ఏపీ - నైజాంలో కుబేరకు మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లు మరింత పెరగనున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు