విజయ్ ఆంటోనీ బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈయన త్వరలోనే మార్గన్ అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉండడంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు ఈయన. అయితే అలాంటి విజయ్ ఆంటోనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ పుట్టుమచ్చ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ మాట్లాడిన ఆ పుట్టుమచ్చ స్టోరీ మాత్రం చాలామంది అభిమానులను షాకింగ్ కి గురిచేస్తుంది.ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడని విజయ్ ఆంటోని సడన్ గా  హీరోయిన్ పుట్టుమచ్చ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 మరి ఇంతకీ విజయ్ ఆంటోనీహీరోయిన్ పుట్టుమచ్చ గురించి చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. విజయ్ ఆంటోని నటించిన తాజా మూవీ మార్గన్. ఈ సినిమాలో హీరోయిన్ గా బ్రిగిడా నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు హీరోయిన్ బ్రిగిడాలో అక్కడ ఉండే పుట్టుమచ్చ అంటే చాలా  ఇష్టం. ఆమె లిప్స్ కింద పుట్టుమచ్చ ఉంటుంది అది అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ తన మనసులో ఉన్న మాట బయటపెట్టారు విజయ్ ఆంటోనీ.
 అయితే ఈయన మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు విజయ్ ఆంటోనీ టూ రొమాంటిక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక విజయ్ ఆంటోనీ మార్గన్ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ బ్రిగిడాలతో పాటు సముద్రఖని, వినోద్ సాగర్, మహానటి మూవీ శంకర్ వంటి వాళ్లు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. మార్గన్ మూవీతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దీషన్ ఫర్ ద ఫస్ట్ టైం విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: