
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా కుబేర. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ వారంలో కూడా సందడి చేస్తుంది. తొలి వారం ముగియ కుండానే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రు .. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున - కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ - నేషనల్ క్రష్మిక రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమోషనల్ కంటెంట్ గా తరలించిన ఈ సినిమాను పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ లభించడంతో చిత్ర ప్రమోషన్లు చేస్తోంది.
అయితే ధనుష్ సొంత లాంగ్వేజ్ అయిన తమిళనాడు లో అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ కాలేదని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ సినిమా కథ . . . అందులోను ధనుష్ ఉండడంతో అక్కడ వారికి ఈజీగా కనెక్ట్ అవుతుందని భావించానని . . అయితే ఇప్పుడు డిజాస్టర్ అయ్యాక .. తను ఏ విషయంలో తప్పు చేశానో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శేఖర్ కమ్ముల తెలిపారు. ఇక తెలుగులో రెండో వారంలోనూ కుబేర చాలా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు