ఇప్పుడంటే వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు కానీ.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. మహేష్ బాబు, రవితేజ వంటి హీరోలకు భారీ స్టార్డమ్ తో పాటు మాస్ ఇమేజ్ అందించిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రీ ప్రొడెక్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న వీరి ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంది.


బుచ్చిబాబు విషయానికి వస్తే.. ఈయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు. `ఉప్పెన` సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే వంద కోట్లు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో `పెద్ది` అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హైద‌రాబాద్ లో ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.


అయితే పూరి జగన్నాథ్, బుచ్చిబాబు.. ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ఉన్న కామన్ పాయింట్స్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. పూరి జగన్నాథ్, బుచ్చిబాబు ఇద్దరు కూడా ఒకే ఊళ్లో జన్మించారు. అదే పిఠాపురం. అలాగే ఈ ఇద్దరినీ వారి తల్లిలు సీఎంసీ హాస్పిటల్ లోనే డెలివరీ చేశారట. అలా ఒకే ఊళ్లో, ఒకే హాస్పిటల్లో పుట్టిన పూరి జగన్నాథ్, బుచ్చిబాబు.. ఒకే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దర్శకులుగా సత్తా చాటుతున్నారు. ఇదంతా దేవుడు రాత.. నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో పూరి సార్ ఒకరు అంటూ బుచ్చిబాబు తాజాగా సోషల్ మీడియా వేదిక తెలియజేశాడు. ఈ మేరకు పూరితో దిగిన ఓ క్లోజ్‌ ఫోటోను కూడా షేర్ చేయ‌డంతో బుచ్చిబాబు పోస్ట్ వైరల్ గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: