
ఇప్పుడు సౌత్ లో మొత్తం తన హవానే కొనసాగించేలా చేస్తోంది. మాలివుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకునే స్థాయికి చేరింది. డ్రాగన్ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా సినిమా అవకాశాలు రావడంతో ఈ అమ్మడు కాల్షీట్స్ లేనంతగా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కొత్త సినిమా ఏది వచ్చిన సరే క్యాష్ చేసుకొని మరి ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కాయాదు లోహర్ చేతిలో అరడజనుకుపైగా చిత్రాలు ఉన్నాయి.. హీరో శింబుతో, జీవి ప్రకాష్, అధర్వ తో నటించబోతోంది.
ఇక తెలుగులో విషయానికి వస్తే విశ్వక్ సెన్ నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే డైరెక్టర్ వెంకట్ ప్రభు తదుపరి చిత్రానికి కూడా ఈమె పేరు వినిపిస్తున్నట్లు సమాచారం. డ్రాగన్ సినిమా ఎఫెక్ట్ తో తమిళంలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. మలయాళం లో కూడా ఈ అమ్మడు పేరు బాగానే వినిపిస్తోందట. మలయాళం లో కూడా రెండు సినిమాలతో చేరువైన కాయాదు లోహర్ తదుపరి చిత్రాలు నవీన్ పౌలితో , టావినో థామస్ తో పల్లి చట్టంబి చిత్రాలలో నటించబోతోందట. ఈ చిత్రంలో 1950లోని కేరళలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని డీజో జోస్ ఆంటోని తెరకెక్కిస్తున్నారు.. అలాగే దుల్కర్ సల్మాన్ నటించబోతున్న ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం విన్న అభిమానులు లక్ అంటే ఈ ముద్దుగుమ్మదే.. ఒక్క సినిమాతో ఫేట్ మార్చుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.