
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి బర్త డే సందర్భంగా విశ్వంభర ను రిలీజ్ చేస్తారు అనుకుంటే అలా కాకుండా స్టాలిన్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు . దీనితో మెగా ఫాన్స్ ఇంకా మండిపడిపోయారు. విశ్వంభర అప్డేట్ ఏది..? అసలు ఎక్కడ దాకా వచ్చింది..? సినిమా ఉందా..? పోయిందా..? ఏదో ఒకటి చెప్పి తగలాడండి అంటూ ఘాటు ఘాటుగా ట్రోల్ చేశారు. దీనిపై తాజాగా దర్శకుడు వశిష్ట ఒక స్పష్టత ఇచ్చారు . "ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయిపోయింది " అంటూ ఒక ఇంగ్లీష్ పత్రిక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు .
సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడానికి కారణం మేమంతా వి ఎఫ్ ఎక్స్ పనుల్లో బిజీగా ఉండడమే అంటూ తెలిపారు . అంతేకాదు మొత్తంగా సినిమాలో 4676 వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఇది కేవలం ఒక సినిమాగా కాదు ఒక ప్రపంచంలా మీకు అద్భుతమైన ఫీలింగ్ చూపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించే అంశాలతో ప్రేక్షకుడి విశ్వంభర ప్రపంచంలో విహరిస్తాడు . ఈ సినిమా అత్యధికంగా 4676 వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే టాప్ కంపెనీలు దీనికోసం పనిచేస్తున్నాయి అంటూ తెలిపారు .
అంతేకాదు సినిమా మరింత ఆలస్యంగా మారడానికి ఇదే కారణం అన్నారు . అనుకున్న దానికన్నా డబల్ టైం పట్టడానికి కారణం ఇదే అంటూ క్లారిటీ ఇచ్చారు. వీ ఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు అని బలంగా నిర్ణయించుకున్నామని ..మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాతో స్పెషల్ అనుభూతిని పొందుతారు అని చెప్పుకొచ్చారు . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం విఎఫ్ఎక్స్ కొన్ని షాట్స్ చూసి ధ్రిల్ అయ్యారని కూడా చెప్పుకొచ్చారు . ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొలిక్కి వచ్చాక విడుదల తేదీని ప్రకటిస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు వశిష్ట .
దీంతో మెగా అభిమానులు కొంచెం రిలాక్స్ అయినట్లే అనిపిస్తుంది. కానీ గతంలో కూడా చాలా సార్లు ఇదే విధంగా వి ఎఫ్ ఎక్స్ ..వి ఎఫ్ ఎక్స్ కారణంగానే లేట్ అవుతుంది అని చెప్పారు . ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు . అసలు సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే . మరి ఆ సినిమా రిలీజ్ డేట్ ని ఎప్పుడు ప్రకటిస్తారో చిత్రం బృందం అంటూ వెయిటింగ్ మెగా ఫ్యాన్స్..!!?