
తాజాగా `తమ్ముడు` మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత దిల్ రాజు పైరసీ గురించి మాట్లాడుతూ ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. ప్రస్తుత రోజుల్లో ఒక్కో సినిమాకు కోట్లలో బడ్జెట్ వెచ్చిస్తున్నారు. నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, టెక్నీషియన్స్ తో పాటు వేలాది మంది సినీ కార్మికులు ఒక చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నారు. వారి కష్టాన్ని పైరసీ రాయుళ్లు మాత్రం దారుణంగా దోచేసుకుంటున్నారు.
అసలు ఒక పైరసీ కాపీని ఎంతకు అమ్ముతారో తెలిస్తే మతిపోతుంది. సినిమా రిలీజ్ అయిన రోజే థియేటర్స్ లో షూట్ చేసి పైరసీ చేస్తుంటారు. చిన్న సినిమాలు అయితే 400 డాలర్లు (సుమారు 32 వేలు), పెద్ద సినిమా అయితే 1000 డాలర్ల (సుమారు 80 వేలు)కు పైరసీ సైట్స్ కి అమ్ముతారని తాజాగా దిల్ రాజు పేర్కొన్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్.. ఆ డబ్బుల కోసం కోట్లు పెట్టి సినిమా తీసిన మాకు తీవ్ర నష్టం చేస్తున్నారని దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు