యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో హిందీ నటుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ తో పాటు తారక్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ను అనుకుంటున్నట్లు మరికొన్ని రోజుల్లోనే దానిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తారక్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ కి కమిట్ అయినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్లు ఆ మూవీ పూర్తి అయిన వెంటనే తారక్ తో సినిమాతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఇప్పటికే త్రివిక్రమ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో ఓ క్రేజీ నటుడిని కూడా ఫైనల్ కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తారక్ , త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో రానా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాలో రానా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం తారక్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దానితో ఈ ఇద్దరి కాంబో లో మరో సినిమా స్టార్ట్ అయితే దానిపై భారీ స్థాయిలో అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: