
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా తన మార్కెట్ ను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీతో తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. `AA22` వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించబడ్డ ఈ చిత్రానికి అల్లు అర్జున్ ఏకంగా రూ. 175 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడని టాక్.
`సలార్`, `కల్కి 2898 ఏడీ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం అర డజన్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈయన ఒక్కో మూవీకి రూ. 200 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని అంటున్నారు.

సీనియర్ స్టార్స్ లో చిరంజీవి రూ. 50 కోట్లు, వెంకటేష్ మరియు బాలయ్య రూ. 30 కోట్లు, నాగార్జున రూ. 20 కోట్లు తీసుకుంటున్నారట. అలాగే హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని.. ఒక్కో చిత్రానికి రూ. 35 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఉస్తాద్ రామ్ పోతినేని, రవితేజ రెమ్యునరేషన్స్ కూడా రూ. 20 కోట్ల రేంజ్‌లోనే ఉన్నాయని టాక్.