తాజాగా బాలీవుడ్లో నితేష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న రామాయణ పార్ట్-1 కి సంబంధించిన గ్లింప్స్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ గ్లింప్స్ లో రాముడు పాత్రలో రన్బీర్ కపూర్ ని రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ ని తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రన్బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నాడని చెప్పినప్పటినుండి సోషల్ మీడియాలో ఆయనపై చాలా నెగెటివిటీ ఏర్పడింది. ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్ వైరల్ అవ్వడంతో ఓ నెటిజన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఛీ ఛీ కర్మ కర్మ బీఫ్ తినే వాడితో రాముడి పాత్ర వేయించడం ఏంటో అంటూ పోస్ట్ పెట్టాడు.అయితే ఈ పోస్టు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో ఇది కాస్త సింగర్ చిన్మయి కంటపడింది.

ఇక ఈ పోస్ట్ చూసిన సింగర్ చిన్మయి నేరస్తులు,అత్యాచారాలు చేసిన వాళ్లే రాజ్యమేలగా లేనిది ఎవరో బీఫ్ తింటే రాముడు పాత్రలో నటించగా వచ్చిందా అని కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ కౌంటర్ కి ఆ నెటిజన్ బీఫ్ తినేవాడిని రాముడు పాత్రలో  చూపించడం కరెక్టేనా అని మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు.దానికి చిన్మయి మాట్లాడుతూ.. అత్యాచారాలు, అన్యాయాలు చేసినవాళ్లు జైలుకు వెళ్లి వచ్చి కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా సీఎంలుగా కొనసాగుతున్నారు.అలాంటి వారే రాజ్యమేలినప్పుడు ఇది ఒక లెక్కనా రేపిస్టు రాజ్యమేలగా లేనిది బీఫ్ తినే వాడితో రాముడు పాత్ర వేయిస్తే మీకు ఏంటి ప్రాబ్లం అంటూ కౌంటర్ ఇచ్చింది.

 ఇక ఈ కౌంటర్ కి ఆ నెటిజన్ ఒక చెడ్డ పనిని మరో చెడ్డ పనితో చూపించడం అవసరమా.. మీరు ఫెమినిస్ట్ అయితే ఫెమినిజంతోనే మాట్లాడుకోండి. ఈ మేటర్ లోకి మాత్రం దూరకండి. అంటూ ఆ నెటిజన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో చిర్రెత్తుకుపోయిన చిన్మయి దేవుడి పేరుతో అటెన్షన్ సీక్ చేయాలనుకునే వాడిని ఆ దేవుడే నాశనం చేస్తాడని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు.ఇక మీ ఇష్టం త్వరలో జరిగేది మీరే చూస్తారు అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం చిన్మయి ఇచ్చిన రిప్లై ఆ నెటిజన్ పెట్టిన కౌంటర్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనప్పటికీ రాముడు పాత్రలో రన్బీర్ కపూర్ నటించడం మాత్రం చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: