
స్క్రీన్ పై గ్లామర్ షో కన్నా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయడానికి మొగ్గు చూపే నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. అదే ఆమెను దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెట్టింది. గత ఏడాది నేషనల్ అవార్డు కూడా నిత్యా మీనన్ ను ముద్దాడింది. సినిమాల గురించి పక్కన పెడితే.. నిత్యా మీనన్ అసలు పేరేంటో మీకు తెలుసా? బహుశా ఆమె ఫ్యాన్స్ కూడా చెప్పలేరేమో.
నిత్యా మీనన్ కు ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు `ఎన్.ఎస్.నిత్య`. ఎన్ అంటే తల్లి నళిని పేరులో ఫస్ట్ లెటర్, అలాగే ఎస్ అంటే తండ్రి సుకుమార్ పేరులో ఫస్ట్ లెటర్ కలిపి ఎన్ఎస్ నిత్య అని పెట్టారు. అలాగే అందరూ ఆమె మలయాళీ అనుకుంటాను. కానీ అది నిజం కాదు. నిత్య తండ్రి అయ్యర్ వర్గానికి చెందిన వారు కాగా.. తల్లి మీనన్ వర్గానికి చెందినవారు. వారింట ఇంటి పేర్లను ఉపయోగించరు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక వృత్తి రీత్యా దేశవిదేశాలు తిరగాల్సి రావడంతో తప్పనిసరై పాస్‌పోర్ట్‌లో ఎన్.ఎస్.నిత్యను నిత్యా మీనన్ గా మార్చుకున్నానని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చింది.