ఇక మన టాలీవుడ్ లో తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ కూడా ఒకరు .. ఈ బ్యూటీ మరోసారి సంచలన జ్యోతిష్యుడు వేణు స్వామి తో పూజలు కారణంగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది .. మోడలింగ్ రంగం నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ బ్యూటీ .. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకుంది .. ప్రస్తుతం టాప్ హీరోలకు జంటగా అవకాశాలు అందుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతుంది . అయితే ప్రజెంట్ రిలీజ్ కు రెడీ అయిన పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు, ప్రభాస్ తో కలిసి నటిస్తున్న రాజా సాభ్‌ సినిమాలోని నీధి హీరోయిన్గా నటిస్తుంది . ఈ రెండు సినిమాలు షూటింగ్ ముగించుకొని విడుదల విషయంలో కాస్త ఆలస్యం జరుగుతూ వస్తుంది .


 ముఖ్యంగా హరిహర వీరమల్లు జులై 24న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. అలాగే నిధి ఈ సినిమాకు మంచి విజయం కలగాలని భావంతో ఇటీవల వేణు స్వామిని కలిసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి . అయితే తాజాగా వేణు స్వామి నేతృత్వంలో హీరోయిన్ నిధి మరోసారి పూజలు చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .  గతంలోనూ ఈమె వేణు స్వామిని కలిసినట్టు ఆ తర్వాత ఈమెకు మంచి అవకాశాలు వచ్చాయని కూడా ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఆమె ప్రత్యేక పూజలు చేయించుకున్నట్టు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు ..


ఇక‌ ఇప్పటికే రష్మిక మందన్నా , డింపుల్ హయాతి, ఆషు రెడ్డి వంటి ముద్దుగుమ్మలు వేణు స్వామిని కలిసిన వీడియోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే . గతంలో కొందరు పైన‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సైలెంట్ గా ఉన్న వేణు స్వామి దగ్గరికి మళ్ళీ ఇలా ఆయన చుట్టూ ముద్దుగుమ్మలు క్యూ కడుటుండటంతో ,  ఆయనపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్య్‌ కూడా వైరల్ గా మారాయి .. అలాగే నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు వీడియో చూసిన నేటిజెన్లు పూజలు చేస్తే సినిమాలు హిట్ అవ్వని .. కొందరు కామెంట్లో చేస్తుంటే మరికొందరేమో వేణు స్వామి టైమ్‌ మళ్లీ వచ్చిందా ? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు .. ఇక మరి ఈ పూజల ద్వారా నిధికి ఎంతవరకు సక్సెస్ వస్తుందో చూడాలి ..



మరింత సమాచారం తెలుసుకోండి: