
కోలీవుడ్లో స్టార్ దర్శకులుగా పేరుపొందిన సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి కీర్తిశ్వరన్ డైరెక్షన్లో డ్యూడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్ రూ.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా 20 నుంచి 25 కోట్ల రూపాయలలోపే ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే డ్యూడ్ సినిమాకి కేవలం డిజిటల్ రైట్స్ తోనే లాభాల జోన్లోకి వెళ్లిపోయింది.
ఇంకా మ్యూజిక్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా చేతిలో ఉన్నాయి. థియేటర్లో ఒకవేళ హిట్ టాకు వస్తే అక్కడ నుంచి కూడా భారీగానే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎలా అయినా చూసిన కూడా మైత్రి మూవీస్ మేకర్స్ కి ప్రదీప్ రంగనాథ నటిస్తున్న డ్యూడ్ సినిమాతో జాక్ పాట్ కొట్టినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ప్రాపర్టీ దశలో సినిమా అంటే నిర్మాతలకు ఇంతకుమించి ఆనందం ఏదైనా ఉంటుందా అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రేమలో హీరోయిన్ మమితా బైజు నటిస్తున్నది. దీపావళికి విడుదల చేసేలా ఈ ఏడాది ప్లాన్ చేస్తున్నారు.